ఈ నెల 11న పవన్ కల్యాణ్ ని కలుస్తా: ఉండవల్లి అరుణ్ కుమార్
Add ap7am to your home Screen

ఈ నెల 11న పవన్ కల్యాణ్ ని కలుస్తా: ఉండవల్లి అరుణ్ కుమార్

  • పవన్ కల్యాణ్ కార్యాచరణ ఏంటో తెలిశాక మాట్లాడతా
  • పవన్ పొలిటికల్ రిస్క్ తీసుకున్నారు
  • రాష్ట్రానికి ఏదైనా చేయాలనే తపన ఆయనలో ఉంది: ఉండవల్లి
ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలను సాధించేందుకు నిర్ణయించిన వేదికలో మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌, లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ లాంటి వారిని క‌లుపుకుని ముందుకు వెళతానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్న విషయం విదితమే.

ఈ వ్యాఖ్యలపై ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ, పవన్ కల్యాణ్ కార్యాచరణ ఏంటో తెలిశాక మాట్లాడతానని, ఈ నెల 11న హైదరాబాద్ లో ఆయన్ని కలుస్తానని చెప్పారు. పవన్ కల్యాణ్ పొలిటికల్ రిస్క్ తీసుకున్నారని, రాష్ట్రానికి ఏదైనా చేయాలనే తపన ఆయనలో ఉందని అన్నారు. అయితే, పోరాటం చేసే పరిస్థితుల్లో ప్రజలు లేరని, ఏదైనా చేస్తే రాజకీయ పార్టీలే చేయాలని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
Andhra Pradesh
Undavalli
Pawan Kalyan

More Telugu News