ఉండవల్లి, జయప్రకాశ్ నారాయణలను కలుపుకుపోతా!: పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్య
- కేంద్రం నుంచి ఏపీ ప్రయోజనాలు సాధించడం కోసం ఓ వేదిక కావాలి
- జనసేన గొంతు సరిపోవడం లేదు
- వ్యక్తిగతంగా వెళ్లి కొందరు నాయకులను కలుస్తా
- బంద్ పేరుతో మనవారిని మనం ఇబ్బందులకు గురి చేయడం సరికాదు
ఉండవల్లి, జయప్రకాశ్ నారాయణలను తాను వ్యక్తిగతంగా కలుస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన గొంతు సరిపోవడం లేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే వాటిలో అసత్యాలు ఉన్నాయని చెప్పారు. తాను రేపటి బంద్‌కు వ్యతిరేకం కాదని, కాకపోతే శాంతియుతంగా నిరసనలు జరపాల్సి ఉందని చెప్పుకొచ్చారు. బంద్‌ల పేరుతో మనవాళ్లని మనం ఇబ్బందులకు గురిచేయడం సరికాదని చెప్పారు.