Pawan Kalyan: కాసేపట్లో మీడియా ముందుకు పవన్ కల్యాణ్ .. కీలక ప్రకటన చేసే అవకాశం?

  • సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం
  • హైదరాబాద్‌లోని జనసేన పరిపాలన కార్యాలయంలో పలు వివరాలు తెలపనున్న పవన్
  • ఏం మాట్లాడుతారా? అన్న విషయంపై ఆసక్తి
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ పేర్కొంది. హైదరాబాద్‌లోని జనసేన పరిపాలన కార్యాలయంలోనే పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడతారని వివరించింది. పవన్ ఏ విషయంపై మీడియాకు వివరిస్తారన్న విషయాన్ని మాత్రం తెలపలేదు.

తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఏపీ ప్రజలు, రాజకీయ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించలేదని వారు అంటున్నారు. పవన్ కల్యాణ్ ఈ విషయంపైనే మాట్లాడుతారా? లేక ప్రత్యేక హోదాపై తాను చేయాలనుకుంటోన్న పోరుపై మాట్లాడుతారా? అని విషయంపై ఆసక్తి నెలకొంది. లేదంటే పవన్ కల్యాణ్ తాను ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటించే విషయం, పార్టీ బలోపేతంపై కూడా మాట్లాడే అవకాశం ఉంది.

More Telugu News

Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh