robbry attempt: జైపూర్ లో రూ.925 కోట్ల రూపాయల బ్యాంకు దోపిడీ యత్నం... కాల్పులు జరిపి అడ్డుకున్న కానిస్టేబుల్

  • బ్యాంకు శాఖలోకి చొరబడేందుకు 13 మంది ప్రయత్నం
  • కాల్పులు జరపడంతో వాహనంలో పరార్ 
  • నిరోధించలేకపోతే రూ.925 కోట్లు దొంగలపాలయ్యేది

భారీ బ్యాంకు దోపిడీ యత్నం ఓ కానిస్టేబుల్ ధైర్య, సాహసాల కారణంగా విఫలమైంది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆయుధాలు ధరించిన 13 మంది దుండగులు సి.స్కీమ్ ప్రాంతంలోని ఓ స్థానిక బ్యాంకు వద్దకు వచ్చారు. అప్పుడు సమయం వేకువజామున 2.30గంటలు.

షట్టర్ ను తొలగించి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా, కాపలా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సీతారామ్ వెంటనే కాల్పులు ప్రారంభించాడు. అలారమ్ కూడా మోగించాడు. దాంతో వచ్చిన దుండగులు వాహనంలో పారిపోయారు. అలారమ్ మోగించడంతో సంబంధిత ప్రాంతానికి మరింత మంది పోలీసులు నిమిషాల్లో చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నగరం అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక్కడి బ్యాంకు శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలకు నగదును పంపే కేంద్రంగా పనిచేస్తుందని, సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని పోలీసులు పేర్కొన్నారు.

More Telugu News