ఆదాయపు పన్ను చెల్లింపుల్లో చిన్నపాటి మొత్తంలో తేడాలకు ఇకపై నోటీసులు ఇవ్వరు!

  • ఇకపై చెల్లింపుల్లో స్వల్ప తేడాలకు నోటీసులివ్వరాదని నిర్ణయం
  • ఈ ఏడాది ఏప్రిల్ నుండే ఈ విధానం అమల్లోకి
  • ఎనిమిది కోట్లకు పెరిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య
ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్-సీబీడీటీ) పన్ను చెల్లింపుదారులకు ఓ శుభవార్త వినిపించింది. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో చిన్నపాటి మొత్తంలో తేడాలకు నోటీసులు జారీ చేయరాదని బోర్డు విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు నివేదించామని బోర్డు ఛైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు.

 2018-19 అసెస్‌మెంట్ ఏడాదికి గాను ఏప్రిల్ 1 నుండే దీన్ని అమల్లోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉన్నా, ఎగవేసినట్లు అనుమానాలున్నా మరింత జాగ్రత్తగా పరిశీలిస్తామని ఆయన అన్నారు. చెల్లించే ఆదాయపు పన్ను, టాక్స్ క్రెడిట్ స్టేట్‌మెంట్‌గా వ్యవహరించే ఫారం-26 ఏఎస్, ఉద్యోగులకు సంస్థ జారీ చేసే ఫారం-16లో వ్యత్యాసాల ఆధారంగా బెంగళూరులోని సీపీసీ ద్వారా ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తోంది.

మరోవైపు పన్ను చెల్లింపుదారుల జాబితాలోకి మరింత మందిని తీసుకురావడం ద్వారా మొత్తం పన్ను చెల్లింపుదారుల సంఖ్య 8 కోట్లకు చేరుకుందని సుశీల్ చంద్ర చెప్పారు. ప్రత్యక్ష పన్నుల సంస్కరణలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసిందని, వాటన్నింటినీ తాము సంఘటితం చేసి అమలు చేస్తున్నామని ఆయన అన్నారు 
Go Back to Shorts
CBDT
Income Tax Department
direct tax reforms

More Telugu News