Kareena: భర్త ఏడిపిస్తున్నాడంటున్న బాలీవుడ్ బ్యూటీ!

షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్‌ల పెళ్లయి ఆరేళ్లవుతోంది. వారి ప్రేమకు ప్రతిరూపంగా తైమూర్‌ పుట్టాడు. అయితే కరీనా ఇప్పటికీ తన భర్త తనను ఏడిపిస్తున్నాడని కంప్లైంట్ చేస్తోంది. అదేంటి? ఇద్దరూ బాగానే ఉన్నారుగా... మరి ఆమెను భర్త ఏడిపించడమేంటని అనుకుంటున్నారా? నిజమే... సైఫ్ ఎప్పుడు సినిమా షూటింగ్‌లకు బయలుదేరినా తనకు విచారంగానే ఉంటోందని, ఈ రకంగా ఆయన ఇప్పటికీ తనను బాధపెడుతున్నాడని కరీనా చమత్కరించింది.

 ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె తన భర్తపై ప్రేమను వ్యక్తం చేసుకుంది. ఇక సైఫ్ కూడా కరీనాను కొన్ని రోజుల కిందటే మీడియా సమక్షంలో పొగడ్తలతో ముంచెత్తాడు. కరీనా బాధ్యత గల తల్లిగా ఉండటం తనకు బాగా నచ్చిందని, తను ఎప్పుడూ ప్రేమగానే ఉంటుందని, తైమూర్‌కి కూడా అమ్మంటేనే చాలా ఇష్టమని సైఫ్ చెప్పుకొచ్చాడు. కరీనా ప్రస్తుతం 'వీరే ది వెడ్డింగ్' సినిమా చిత్రీకరణతో బిజీగా ఉంది. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Go Back to Shorts
Kareena
Saif
tymoor

More Telugu News