తుపాకీతో ఇంట్లోంచి బయటకు వచ్చి భర్త ప్రాణాలు కాపాడిన భార్య.. మీరూ చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తుపాకీతో ఇంట్లోంచి బయటకు వచ్చి భర్త ప్రాణాలు కాపాడిన భార్య.. మీరూ చూడండి!

  • ఉత్తరప్రదేశ్‌లోని ల‌క్నోలో ఘటన
  • ఇంటి ముందు నిలబడ్డ వ్యక్తి
  • దూసుకొచ్చి దాడి జరిపిన నలుగురు దుండగులు
ఉత్తరప్రదేశ్‌లోని ల‌క్నోలో ఓ వ్య‌క్తి త‌న ఇంటి ముందు నిల‌బ‌డి ఉండ‌గా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఒక్క‌సారిగా దూసుకొచ్చి ఆయ‌న‌పై పిడిగుద్దులు కురిపిస్తూ, రాడ్‌తో కొడుతూ దాడి చేశారు. తన భర్తపై కర్రలతో దాడి చేస్తున్నార‌ని తెలుసుకున్న భార్య తుపాకీ తీసుకుని వచ్చి వచ్చి స‌ద‌రు దుండ‌గుల‌ను బెంబేలెత్తించింది. కాల్పులు జరిపి వారిని పరుగులెత్తించింది. ఆ త‌రువాత ఆ తుపాకీని త‌న భ‌ర్త‌కు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. దుండ‌గుల్లో ఇద్ద‌రు ముఖానికి ముసుగులు ధ‌రించి వ‌చ్చారు.
wife
saved
husband

More Telugu News