rana: ఏనుగులను మచ్చిక చేసుకునే పనిలో రానా!

షార్ట్స్‌లో చూడండి
విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, సక్సెస్ లను రానా తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన 'హాథీ మేరా సాథీ' సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన ఏనుగులతో స్నేహంగా వుండే పాత్రలో కనిపించనున్నాడు. ఆయనతో పాటు 15 ఏనుగులు షూటింగులో పాల్గొననున్నాయి.

ఈ నెలాఖరులో 'థాయ్ ల్యాండ్' అడవుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ లోగానే ఆ ఏనుగులతో మచ్చిక చేసుకోవడం వలన మంచి అవుట్ ఫుట్ వస్తుందని భావించిన రానా, అందుకోసం 15 .. 20 రోజులను కేటాయించనున్నట్టు సమాచారం. అనుకున్న సమయానికి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన సన్నాహాల్లో దర్శకుడు ప్రభు సాల్మన్ వున్నాడు. హిందీతో పాటు తెలుగు .. తమిళ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.      
Go Back to Shorts
rana

More Telugu News