venkatesh: తేజ .. వెంకటేశ్ మూవీలో నారా రోహిత్!

షార్ట్స్‌లో చూడండి
రానాతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా చేసి తేజ హిట్ కొట్టగానే, ఆయనతో సినిమా చేయడానికి వెంకటేశ్ ఆసక్తిని చూపించారు. దాంతో వెంకటేశ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకున్న తేజ .. ఒక కథను సిద్ధం చేసి ఆయనను ఒప్పించాడు. వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి. ఈ నెల 3వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమాలో కథను మలుపుతిప్పే ఓ కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్రను నారా రోహిత్ చేస్తే బాగుంటుందని భావించిన తేజ ఆయనను సంప్రదించాడట. కథ .. పాత్ర బాగుండటం , వెంకటేశ్ కాంబినేషన్ కావడంతో నారా రోహిత్ వెంటనే అంగీకరించాడని చెబుతున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.    
Go Back to Shorts
venkatesh
nara rohith

More Telugu News