YSRCP: ఏపీకి అన్యాయం జరిగిందంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారు!: వైసీపీ నేత పార్థసారథి తీవ్ర వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
కేంద్రబడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ సీఎం చంద్రబాబు డ్రామాలాడుతున్నారని వైసీపీ నేత పార్థసారథి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ, నాలుగేళ్లుగా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని, బీజేపీ, టీడీపీ కలిసి బడ్జెట్ లో ఏపీ ప్రజలను దగా చేశాయని ఆరోపించారు. ఎన్డీయేలో భాగస్వామి అయిన చంద్రబాబు, ఏపీకి అన్యాయం జరిగిందంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 23 సార్లు ఢిల్లీ వెళ్లింది రాష్ట్రం కోసం కాదని, కేసుల మాఫీ కోసమేనని, రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి చంద్రబాబే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసు కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు.
Go Back to Shorts
YSRCP
partha sarathi
Chandrababu
Telugudesam

More Telugu News