Chandrababu: కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ మంత్రివర్గం

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. సుదీర్ఘంగా కొనసాగుతోన్న ఈ సమావేశంలో మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ కంటెంట్ కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షించిన మంత్రివర్గం ఆరు ఎకనమిక్ సిటీల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. తూర్పు గోదావరి, కర్నూలు, కృష్ణా, గుంటూరు, విశాఖ పట్నం జిల్లాల్లో వీటిని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. వీటి ద్వారా 1,61,983 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
cabinet

More Telugu News