ఏడేళ్ల తర్వాత తొలిసారి దక్షిణాఫ్రికాలో వన్డే గెలిచిన భారత్.. ఆ గడ్డపై కోహ్లీ తొలి సెంచరీ!
- సఫారీల 17 వరుస విజయాలకు కోహ్లీ సేన బ్రేక్
- దక్షిణాఫ్రికాలో కోహ్లీ తొలి సెంచరీ
- చివరిసారి 2011లో దక్షిణాఫ్రికాపై వన్డేల్లో విజయం
ఇక ఈ మ్యాచ్‌లో 112 పరుగులతో కెరీర్‌లో 33వ సెంచరీ నమోదు చేసిన కోహ్లీకి సఫారీ గడ్డపై మొదటి శతకం కావడం గమనార్హం. ఈ సెంచరీతో కోహ్లీ ఖాతాలో మొత్తం 54 సెంచరీలు చేరాయి. అతడి కంటే ముందు జాక్విస్ కలిస్ (62), కుమార్ సంగక్కర (63), రికీ పాంటింగ్ (71), సచిన్ టెండూల్కర్ (100) ముందున్నారు. ఈ సెంచరీకి ముందు సౌతాఫ్రికాలో కోహ్లీ అత్యధిక స్కోరు 87(నాటౌట్) మాత్రమే.