కాంగ్రెస్ తో ఉన్న ముస్లింలు కిల్లర్స్... మాతో ఉన్న వారు మంచోళ్లు: బీజేపీ నేత వివాదాస్పదన వ్యాఖ్యలు

  • 22 మంది కార్యకర్తలను ముస్లింలు హత్య చేశారు
  • వారు కాంగ్రెస్ వారే
  • బీజేపీ నేత ఈశ్వరప్ప సంచలన కామెంట్లు 
  • కొట్టిపడేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీనియర్ బీజేపీ నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలకు తెరతీశారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న ముస్లింలు కిల్లర్స్ (హత్యాకోరులు) అని, తమ పార్టీతో ఉన్న వారు మంచి ముస్లింలు అని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప వ్యాఖ్యానించారు. మరో మూడు నెలల్లో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఈశ్వరప్ప వ్యాఖ్యలు సంచలనానికి దారితీశాయి.

‘‘22 మంది ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలను చంపిన ముస్లింలు కాంగ్రెస్ తో ఉన్నవారే. బీజేపీతో ఉన్న ముస్లింలు మంచోళ్లు’’ అని ఈశ్వరప్ప పేర్కొన్నారు. తుముకూరులో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా వీటిని చెత్త వ్యాఖ్యలుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొట్టిపడేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమన్నారు.
Go Back to Shorts
Karnataka
BJP

More Telugu News