economic survey: ఆర్థిక స‌ర్వేలో హిందీ సినిమా డైలాగులు, పాట‌లు

షార్ట్స్‌లో చూడండి
2017-18 ఆర్థిక స‌ర్వేలో స‌మ‌స్య‌ల‌ను స‌రిగా అర్థ‌మ‌య్యే రీతిలో వివ‌ర‌ణ ఇచ్చేందుకు కొన్ని బాలీవుడ్ సినిమా డైలాగుల‌ను, పాట‌ల్లోని ప‌దాల‌ను ఉప‌యోగించారు. వీటిలో 'దామిని' సినిమాలో సన్నీ డియోల్ డైలాగ్ 'తారీఖ్ ప‌ర్ తారీఖ్' ప్ర‌ముఖంగా క‌నిపిస్తోంది. దేశంలో కేసుల‌ను ప‌రిష్క‌రించ‌డంలో న్యాయ‌వ్య‌వ‌స్థ చేస్తున్న జాప్యాన్ని వ‌ర్ణించ‌డానికి ఈ డైలాగ్‌ను ఉప‌యోగించారు. తేదీల మీద తేదీలు చెప్పుకుంటూ కేసులు వాయిదా వేయ‌డం వ‌ల్ల ఆర్థిక పురోగ‌తికి భంగం క‌లుగుతోంద‌ని ఆర్థిక స‌ర్వే వెల్ల‌డించింది.

అలాగే వాతావ‌ర‌ణ మార్పులు, త‌ద‌నుగుణంగా రైతులు ఎదుర్కుంటున్న స‌మ‌స్య‌ల‌ను వివ‌రించేందుకు మ‌నోజ్ కుమార్ న‌టించిన 'ఉప‌కార్' సినిమాలోని పాట‌ను ఉప‌యోగించారు. 'మేరే దేశ్ కీ ధ‌ర్తీ సోనా ఉగ్లే హీరే మోతీ' (నా దేశ మ‌ట్టిలో పండే పంట‌లు బంగారం, వజ్రాలు, ముత్యాల లాంటివి) అనే పాట ప‌దాల‌ను ఆర్థిక స‌ర్వేలో వాడారు.
Go Back to Shorts
economic survey
cinema
dialogue
songs
sunny deol

More Telugu News