నా తండ్రితో కలసి నటించే అవకాశం పదేళ్ల తర్వాత ఇప్పుడు వచ్చింది: సోనమ్ కపూర్
- తండ్రీకూతుళ్లుగా నటించబోతున్న అనిల్, సోనమ్
- సినిమా పేరు - 'ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా'
- అనిల్‌కి జంటగా జూహీ చావ్లా, సోనమ్‌కి జంటగా రాజ్ కుమార్ రావ్
అనిల్ కపూర్ చిత్రం '1942 ఎ లవ్ స్టోరీ' లోని ఓ పాటలోని మొదటి పదాలను ఈ సినిమాకు పేరుగా పెట్టారు. ఇందులో అనిల్‌కి జంటగా జూహీ చావ్లా నటిస్తుండగా, సోనమ్‌కి జంటకి రాజ్‌కుమార్ రావ్ నటిస్తున్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత అనిల్, జూహీలు తెర మీద జంటగా కనిపించబోతున్నారు. అక్టోబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత విధు వినోద్ చోప్రా సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ ఏడాది తన కుమారుడు హర్షవర్థన్ కపూర్‌తో కలిసి కూడా అనిల్ కపూర్ నటించనున్నారు. ఒలింపిక్ పతకం గెల్చుకున్న అభినవ్ బింద్రా బయోపిక్‌లో వారిద్దరూ కలిసి నటించబోతున్నారు.