Ramcharan: చేతిలో కోడి పుంజుని పట్టుకుని రామ్‌చరణ్‌.. 'రంగస్థలం' రిపబ్లిక్‌ డే పోస్టర్‌!

షార్ట్స్‌లో చూడండి
మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ తేజ్, దర్శకుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘రంగస్థలం 1985’ సినిమా నుంచి మరో పోస్టర్ విడుదలైంది. ‘రంగస్థలం రిపబ్లిక్ డే పోస్టర్’ పేరుతో దీనిని ఆ సినిమా యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఎడమ చేతిలో కోడి పుంజుని పట్టుకుని, కుడి చేతితో జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ చెర్రీ కనపడుతున్నాడు.

‘రంగస్థలం 1985’ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నఈ చిత్రంలో స‌మంత క‌థానాయిక‌గా నటిస్తోంది. ఇందులో జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 30న ఈ సినిమా విడుదల కానుంది.
Go Back to Shorts
Ramcharan
rangasthalam
poster

More Telugu News