Pawan Kalyan: చిరంజీవి వల్లే ఏమీ కాలేదు... పవన్ ఏం చేస్తాడు?: విజయశాంతి సూటి ప్రశ్న
తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలివైన వారని, వారెవరూ 'జనసేన' అంటూ తమ ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ ను నమ్మే పరిస్థితి లేదని సీనియర్ నటి విజయశాంతి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో రాణించడం చిరంజీవి వల్లే కాలేదని, ఇక తమ్ముడు పవన్ వల్ల ఏం అవుతుందని ప్రశ్నించిన ఆమె, ప్రస్తుతం టీఆర్ఎస్ పైనా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని అన్నారు. తన అవసరాల కోసమే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని అన్నారు.
తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని కేసీఆర్ తన మంత్రివర్గంలో చేర్చుకోవడమే ప్రజల్లో వ్యతిరేకతకు కారణమని అన్నారు. ఆచార్య జయశంకర్ సూచన మేరకు తాను 'తల్లి తెలంగాణ' పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తే, ఆనాడు ముందుగా ఒక్క మాట కూడా చెప్పకుండా తనను అర్ధరాత్రి సస్పెండ్ చేశారని, ఎందుకు సస్పెండ్ చేశారో ఈ రోజుకు కూడా తనకు చెప్పలేదని ఆరోపించారు. ఇకపై తాను చురుకుగా రాజకీయాల్లో ఉంటానని, తనను ఎన్నికల్లో పోటీ చేయాలని స్వయంగా రాహుల్ గాంధీ కోరారని అన్నారు.