లాకప్ లోకి చేరిన కోడి పుంజులు... తిండి పెట్టలేక పోలీసుల అవస్థలు!
- సంక్రాంతి సీజన్ లో అదుపులోకి కోడిపుంజులు
- నిందితులకు వ్యక్తిగత పూచీకత్తు
- కోళ్లన్నింటినీ ఒకేసారి కోర్టుకు తేవాలన్న న్యాయమూర్తి
ఆ తరువాత వారిని, పుంజులను కోర్టుకు తీసుకెళ్లి న్యాయమూర్తి ముందు నిలిపారు. మిగతా ప్రాంతాల్లోనూ అదుపులోకి తీసుకున్న కోడిపుంజులన్నింటినీ ఒకేసారి ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించడంతో వాటిని మళ్లీ వెనక్కు తీసుకువచ్చి, ఏం చేయాలో తెలియక, లాకప్ లో ఉంచారు. ఇప్పుడు అచ్యుతాపురం స్టేషన్ లాకప్ నేరాలకు పాల్పడిన వాళ్లకు బదులుగా కోళ్లతో నిండుతోంది.