Chandrababu: సీఎం కుర్చీలో కూర్చున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ!

షార్ట్స్‌లో చూడండి
విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో హిందూపురం నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని ఎమ్మెల్మే నందమూరి బాలకృష్ణ ఈరోజు నిర్వహించారు. లేపాక్షి పుస్తకాల అంశంపై నిర్వహించిన ఈ సమీక్షలో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబునాయుడి కుర్చీలో బాలకృష్ణ కూర్చుని ఈ సమావేశం నిర్వహించడంపై విమర్శలు తలెత్తాయి. ఈ సమావేశంలో మంత్రి దేవినేని ఉమ, ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమంలో దర్శనమిచ్చింది. అయితే, సచివాలయం సిబ్బంది మాత్రం చంద్రబాబు ఉపయోగించే కుర్చీని పక్కకు జరిపి, వేరే కుర్చీలో బాలయ్య కూర్చున్నారని చెబుతున్నారు. కాగా, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
Chandrababu
Balakrishna

More Telugu News