మరోసారి ఆలోచించండి: ఓఎస్డీగా జ్యోతిష్యుడి నియామకంపై సీఎం విజయ్‌కి వీసీకే సూచన

Tamil Nadu CM Vijays Appointment of Astrologer as OSD Faces Criticism
  • ఓఎస్డీగా జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకం
  • లౌకిక ప్రభుత్వంలో ఇది ఆమోదయోగ్యం కాదన్న వీసీకే ప్రధాన కార్యదర్శి
  • రాజకీయ సలహాలు ఇవ్వడానికి కూడా ఆమోదయోగ్యుడు కాదన్న సీపీఎం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమించడంపై టీవీకే మిత్రపక్షం వీసీకే స్పందించింది. ఇప్పటికే ఈ నియామకంపై కాంగ్రెస్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జ్యోతిష్యుడిగా, టీవీకే పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న వెట్రివేల్‌ను ఓఎస్డీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

లౌకిక ప్రభుత్వంలో ఇది ఆమోదయోగ్యం కాదని, గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఈ నియామకంపై పునఃపరిశీలన చేయాలని వీసీకే ప్రధాన కార్యదర్శి డి.రవికుమార్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ అశాస్త్రీయ నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన మరో పోస్టులో డిమాండ్ చేశారు.

వెట్రివేల్ వంటి వ్యక్తిని ప్రభుత్వ ఖర్చుతో అధికారిగా నియమించడం ప్రజలలో జ్యోతిష్యంపై విశ్వాసాన్ని పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, ప్రభుత్వం చేసిన ఈ నియామకం ఆమోదయోగ్యం కాదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు పి. షణ్ముగం పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి రాజకీయ సలహాలు ఇవ్వడానికి కూడా ఆమోదయోగ్యుడు కాదని అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Vijay
MK Stalin
Tamil Nadu CM
Radhan Pandit Vetrivel
VCK
D Ravikumar
OSD Appointment

More Telugu News