Pawan Kalyan: ఖమ్మంలో పవన్ కల్యాణ్ ర్యాలీ.. చెప్పు విసిరిన గుర్తుతెలియని వ్యక్తి!

షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిరంతర యాత్రలో భాగంగా ఈ రోజు ఆయన ఖమ్మంలో పర్యటిస్తున్నారు. అయితే, ఈ పర్యటనలో ఉన్న ఆయనపై గుర్తుతెలియని వ్యక్తి ఒకరు చెప్పు విసరడం కలకలం రేపింది. ఓపెన్ టాప్ కారులో అభిమానులకు అభివాదం చేస్తూ వెళుతున్న పవన్ ని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

ఈ క్రమంలో ఆయన వాహనం స్థానిక తల్లాడ సెంటర్ కు చేరుకున్న సమయంలో పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఆ సమూహంలో నుంచి ఓ గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసరడంతో అది పవన్ కారుపై పడటం గమనార్హం. అనంతరం, అక్కడి ఏబీ గార్డెన్స్ లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు.
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena

More Telugu News