'తెలంగాణ ద్రోహులను సర్కారు ఆదరిస్తోంది'.. పవన్‌ రాజకీయ యాత్రపై స్పందించడానికి ఒప్పుకోని కోదండరామ్‌!
Add ap7am to your home Screen

'తెలంగాణ ద్రోహులను సర్కారు ఆదరిస్తోంది'.. పవన్‌ రాజకీయ యాత్రపై స్పందించడానికి ఒప్పుకోని కోదండరామ్‌!

  • రాజకీయ యాత్ర ప్రారంభించిన పవన్ కల్యాణ్‌
  • పవన్ గురించి మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోలేను
  • వచ్చేనెల 4 న హైదరాబాద్‌లో టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశం
రాజకీయ యాత్ర ప్రారంభించిన సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ స్పందించడానికి ఒప్పుకోలేదు. పవన్ గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వారిని కాదని, తెలంగాణ ద్రోహులను సర్కారు అక్కున చేర్చుకుంటోందని అన్నారు.

 కాగా, రాష్ట్ర రైతులు ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై టీజేఏసీ ప్రణాళికలు వేస్తోందని తెలిపారు. వచ్చేనెల 4న హైదరాబాద్‌లో టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుందని పేర్కొన్నారు.
Kodandaram
Pawan Kalyan
Telangana

More Telugu News