మండుతున్న ముడి చమురు... 'పెట్రో' ధరలిక ఆకాశానికి!
- ఒక్క రోజులో ఒక శాతం పెరిగిన క్రూడాయిల్ ధర
- దేశవాళీ అమ్మకాలపై ప్రభావం పడుతుందంటున్న విశ్లేషకులు
- ఇప్పటికే ముంబైలో రూ. 80 దాటిన లీటరు పెట్రోలు ధర
ఇక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో ఫిబ్రవరిలో డెలివరీ అయ్యే క్రూడాయిల్ ధర బ్యారెల్ కు రూ. 39 పెరిగి, రూ. 4,084కు చేరగా, మార్చి నెలలో డెలివరీ అయ్యే క్రూడాయిల్ ధర రూ. 38 పెరిగి, రూ. రూ. 4,085కు చేరింది. ఇదే సమయంలో కాస్తంత నాణ్యత అధికంగా ఉండే బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.55 శాతం పెరిగింది. ఒపెక్ సభ్య దేశాలు ఉత్పత్తిని నిదానంగా తగ్గిస్తుండటం కూడా క్రూడాయిల్ ధరలు పెరిగేందుకు దోహదపడుతోంది. ఇదే సమయంలో వరల్డ్ స్టాక్ మార్కెట్లు వృద్ధి బాటలో ఉండటం, ఆర్థికాభివృద్ధిపై అంతర్జాతీయ ద్రవ్య నిధి వెలువరించిన గణాంకాలు ఆయిల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచుతున్నాయి.