madhya pradesh: మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ ఆనందీబెన్

  • స్వాగ‌తం ప‌లికిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌
  • గుజ‌రాత్ సీఎంగా ప‌నిచేసిన ఆనందీబెన్‌
  • ఆమె స్థానాన్ని భ‌ర్తీ చేసిన విజ‌య్ రూపానీ

2014 నుంచి ఆగ‌స్టు 2016 వ‌రకు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆనందీ బెన్ ప‌టేల్ ఇవాళ మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌గా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇప్ప‌టి వ‌రకు గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న ఓమ్ ప్ర‌కాశ్ కోహ్లీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు చూసుకుంటున్నారు. ఆయ‌న స్థానంలో ఆనందీ బెన్ ప‌టేల్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు.

మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ హేమంత్ గుప్తా రాజ్‌భవన్‌లో ఆనందీబెన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. త‌ర్వాత‌ ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమెకు పుష్ప‌గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆనందీ బెన్ త‌ర్వాత ఆమె స్థానంలో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా విజ‌య్ రూపానీ ఎన్నికైన సంగ‌తి తెలిసిందే.

More Telugu News