Pawan Kalyan: పవన్ కల్యాణ్ రాజకీయ యాత్రపై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందన

షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఈ రోజు జగిత్యాలలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి రాజకీయ యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఒక్కో రాజకీయ నేత ఒక్కో మార్గం ఎంచుకుంటారని, అలాగే పవన్ కల్యాణ్ ప్రజా యాత్రను ఎంపిక చేసుకున్నారని అన్నారు.

 పవన్ కల్యాణ్‌ ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించామని అన్నారు. ఒక పార్టీ పెట్టిన వ్యక్తి ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకునేందుకు యాత్ర చేయడంలో తప్పులేదని, పవన్ ప్రారంభించిన ప్రజా యాత్రను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena
ganta srinivasa rao
Telugudesam

More Telugu News