Pawan Kalyan: తెలంగాణ, ఆంధ్ర.. రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తాం.. నాకు చిరంజీవి మ‌ద్ద‌తు లేదు: ప‌వ‌న్ క‌ల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
తమ పార్టీ తెలంగాణ, ఆంధ్ర ప్ర‌దేశ్‌ రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందని సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ఇరు రాష్ట్రాల్లో త‌మ‌కు బలం ఉన్న అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామ‌ని వివ‌రించారు. తాము ఎన్ని సీట్లలో పోటీ చేస్తామనే విష‌యం ఎన్నిక‌లకు రెండు నెల‌ల ముందు అంద‌రికీ తెలుస్తుందని అన్నారు. ఇందు కోసం తాము సీనియర్ జర్నలిస్టులు, మేధావుల సలహాలు కూడా తీసుకుంటామ‌ని చెప్పారు.

తాను రేపు, ఎల్లుండి త‌మ పార్టీ కార్యకర్తలతో చ‌ర్చ‌లు జ‌రుపుతాన‌ని అన్నారు. తాను గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీలకు సదుద్దేశంతోనే మద్దతు పలికానని అన్నారు. కాగా, తన రాజకీయాలకు, చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాజకీయాల్లో తనకు కుటుంబ సభ్యుల మద్దతు లేదని స్పష్టం చేశారు.     
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena
Chiranjeevi

More Telugu News