భర్తకు ఎదురెళ్లి, హారతిచ్చి వీడ్కోలు పలికిన అన్నా లెజినోవా!

  • కొండగట్టు అంజన్న సన్నిధికి బయలుదేరిన పవన్
  • అభిమానుల కోలాహలం మధ్య టాటా చెప్పిన అన్నా
  • నేటి నుంచి పవన్ కల్యాణ్ యాత్ర
ప్రజల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో ఈ ఉదయం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయుని సన్నిధికి బయలుదేరిన పవన్ కల్యాణ్ కు, ఆయన భార్య అన్నా లెజినోవా ఎదురొచ్చారు. అంతకుముందు ఆమె, అభిమానుల కోలాహలం మధ్య పవన్ కు హారతిచ్చి, బొట్టు పెట్టారు. అక్కడికి వచ్చిన జనసేన మహిళా కార్యకర్తలు, పవన్ చేతికి రక్ష కట్టారు. ఆపై గుమ్మడికాయ దిష్టి తీశారు.

తరువాత పవన్ తన భార్యను దగ్గరకు తీసుకుని వీడ్కోలు చెప్పి కారు ఎక్కగా, కారుకు ఎదురు వచ్చిన ఆమె, ఆపై వెనుదిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్లారు. 'చలోరే చల్' కార్యక్రమంలో భాగంగా, నేటి నుంచి పవన్ యాత్రను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కొండగట్టుకు చేరుకోనుండగా, ఆయన కాన్వాయ్ లో భారీ ఎత్తున అభిమానుల వాహనాలు బారులు తీరాయి.
Go Back to Shorts
Pawan Kalyan
Anna Lezenova

More Telugu News