Telugudesam: టీఆర్‌ఎస్‌లో విలీనం చేద్దామంటూ మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలపై.. టీటీడీపీ నేతల భేటీ

షార్ట్స్‌లో చూడండి
టీటీడీపీని తెలంగాణ అధికార‌ టీఆర్ఎస్‌ పార్టీలో విలీనం చేయాలంటూ మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌లువురు టీటీడీపీ నేత‌లు ఖండించారు. మోత్కుప‌ల్లి చేసిన వ్యాఖ్య‌ల‌పై చ‌ర్చించడానికి టీటీడీపీ సీనియర్‌ నేతలు హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, నామా నాగేశ్వర‌రావు, గరికపాటి మోహన్ రావు, పెద్దిరెడ్డితో పాటు తదితరులు స‌మావేశం అయ్యారు. త‌మ పార్టీ ఎలా ముందుకు వెళ్లాల‌న్న అంశంపై కూడా చ‌ర్చిస్తున్నారు. 
Go Back to Shorts
Telugudesam
Telangana
l.ramana

More Telugu News