Kathi Mahesh: కత్తి మహేశ్ కుటుంబ సభ్యుల గురించి మీకు తెలుసా?.. ఆయన కుమారుడికి ఇప్పుడు ఎనిమిదేళ్లు!

షార్ట్స్‌లో చూడండి
సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిమానుల తీరుపై పోరాడుతూ హాట్ టాపిక్‌గా మారిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఎవరు? ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అన్న విష‌యంపై అంద‌రికీ ఆస‌క్తి పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఓ పత్రిక కథనం ప్రకారం, ఆయన సొంత ఊరు చిత్తూరు జిల్లాలోని ఎల్లమంద కాగా, ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. కత్తి మహేశ్ తండ్రి కత్తి ఓబులేశు ప్రస్తుతం సొంత ఊరైన ఎల్లమందలోనే నివసిస్తుండగా, కత్తి మహేశ్ తల్లి సరోజమ్మ ఏడాదిన్నర క్రితం కేన్సర్‌తో బాధపడుతూ మృతి చెందారు.

ఇక కత్తి మహేశ్‌కి కత్తి రవికుమార్ అనే సోదరుడు ఉన్నారు. ఆయన బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కత్తి మహేశ్ సోదరి వాణిశ్రీ సికింద్రాబాద్‌లో న్యూట్రిషనిస్ట్‌. ఇక కత్తి మహేశ్ కోల్‌కతా యువతి సొనాలిని ఛాటింగ్ ద్వారా పరిచయం చేసుకుని ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె లక్నోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. కత్తి మహేశ్, సొనాలి దాంపత్యానికి చిహ్నంగా ఓ కుమారుడు పుట్టాడు. ప్రస్తుతం ఆ బాబుకి ఎనిమిదేళ్లు.. తల్లి వద్దే ఉంటూ చదువుకుంటున్నాడు.
Go Back to Shorts
Kathi Mahesh
Pawan Kalyan
family

More Telugu News