Pawan Kalyan: హైదరాబాదులో పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం!

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మను హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్శిటీలో దహనం చేశారు. ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ పై పవన్ అభిమానులు కోడిగుడ్లతో చేసిన దాడిని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

అయితే, ఇదే సమయంలో పవన్ కల్యాణ్ అభిమానులు కూడా అక్కడకు చేరుకోవడంతో... పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జై జనసేన, జై పవన్ కల్యాణ్ అంటూ వారు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో, అక్కడ ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అయితే, సకాలంలో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని, అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. దీంతో, అక్కడి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.
Go Back to Shorts
Pawan Kalyan
Kathi Mahesh

More Telugu News