తనపై వస్తున్న వార్తలను ఖండించిన హీరో అక్షయ్ కుమార్

  • కృత్రిమ జుట్టు ఆపరేషన్ వికటించిందంటూ కథనాలు
  • కొట్టి పారేసిన అక్షయ్
  • కొత్త సినిమా కోసం ఈ మార్పు అంటూ వివరణ
గత నెల రోజుల నుంచి బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కొత్త గెటప్ లో కనిపిస్తున్నాడు. బట్టతల అవతారంలో కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక అక్షయ్ గెటప్ గురించి ఇటీవల ఓ కథనాన్ని వెలువరించింది. కృత్రిమ జుట్టు కోసం అక్షయ్ చేయించుకున్న ఆపరేషన్ వికటించిందని... ఇకపై బట్టతలతోనే కొనసాగాలని ఆయన నిర్ణయించుకున్నాడంటూ తన కథనంలో వెల్లడించింది.

 దీనిపై అక్షయ్ కుమార్ స్పందించాడు. అవన్నీ రూమర్లే అని కొట్టిపారేశాడు. 'కేసరి' సినిమాలో పెద్ద తలపాగా ధరించాల్సిన అవసరం ఉందని... అది ఇబ్బందిగా ఉండటంతో ఇలాంటి హెయిర్ స్టైల్ కొనసాగిస్తున్నానని చెప్పాడు. 1897లో జరిగిన సారాఘరి యుద్ధం నేపథ్యంలో కేసరి చిత్రం తెరకెక్కుతోంది. బ్రిటీష్ సైన్యంలో ఉన్న సిక్కు సైనికులకు, పష్తూన్ ఒరక్ జై తెగకు మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కరణ్ జొహార్, అక్షయ్ కుమార్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.  
Go Back to Shorts
akshay kumar
kesari movie
bollywood

More Telugu News