అమ్మాయిలకు కత్తి మహేశ్ అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టేవాడు!: నిర్మాత రాంకీ
Add ap7am to your home Screen

అమ్మాయిలకు కత్తి మహేశ్ అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టేవాడు!: నిర్మాత రాంకీ

  • సినీ ఇండస్ట్రీకి కత్తి మహేశ్ చీడపురుగు
  • అమ్మాయిలకు అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టేవాడు
  • స్త్రీ లోలుడు: రాంకీ ఆరోపణలు
ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ పై నిర్మాత రాంకీ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఏబీఎన్’తో ఈరోజు ఆయన మాట్లాడుతూ, కత్తి మహేశ్ ను మోహన్ రావిపాటి (సినీ నిర్మాత) తనకు పరిచయం చేశారని, కత్తికి మాటలు చెప్పడంలో ప్రావీణ్యం ఉందని అన్నారు. సినీ ఇండస్ట్రీకి కత్తి మహేశ్ చీడపురుగని, అమ్మాయిలకు మహేశ్ అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టేవాడని, స్త్రీ లోలుడని ఆరోపించారు.

 అసలు, డైరెక్షన్ గురించి కత్తి మహేశ్ కు ఏం తెలియదని, అతనికి మాటలు చెప్పడం మాత్రమే తెలుసు తప్పా, చేతలు లేవని అన్నారు. కత్తి మహేశ్ కు సంబంధించిన మరిన్ని సంచలన విషయాలను ఆ న్యూస్ ఛానెల్ ద్వారా రేపు బయటపెడతానని, అప్పటి వరకు పవన్ కల్యాణ్ అభిమానులు సంయమనం పాటించాలని ఈ సందర్భంగా రాంకీ సూచించారు. 
Kathi Mahesh
Pawan Kalyan

More Telugu News