నేను ప్రసంగించిన ప్రతి చోటా ఇలా గోమూత్రంతో శుద్ధి చేస్తారా?: బీజేపీపై ప్రకాశ్ రాజ్ ఫైర్
- తాను ప్రసంగించిన వేదికను గోమూత్రంతో శుద్ధి చేశారని వ్యాఖ్య
- ట్వీట్ ద్వారా వెల్లడించిన నటుడు
- కర్ణాటకలోని సిర్సిలో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రకాశ్‌రాజ్
గతవారం కర్ణాటకలోని సిర్సిలో జరిగిన 'మన రాజ్యాంగం, మన గౌరవం' అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడి ప్రసంగంలో భాగంగా ఆయన ఉత్తర కన్నడ ఎంపీ, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డేను విమర్శించారు. ఈ విమర్శలకు కౌంటర్‌గా సంక్రాంతి రోజున బీజేపీ యువనేతలు వేదికను గోమూత్రంతో శుద్ధి చేశారు.