Pawan Kalyan: పవన్ అభిమానులు మా నాన్నను కలవాల్సిన అవసరమేంటి?: కత్తి మహేశ్
పవన్ కల్యాణ్ అభిమానులు ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ సొంతూరు వెళ్లి ఆయన తండ్రిని కలిశారట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ పత్రికలో కథనం వెలువడింది. ఈ విషయాన్ని కత్తి మహేశ్ ఓ ట్వీట్ చేశారు. ‘మా పల్లెకొచ్చి, మా ఇంటి కొచ్చి, మా నాన్నను మర్యాదపూర్వకంగా కలవాల్సిన అవసరం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఎందుకొచ్చింది? అదే, మా ఇల్లు మా వాళ్లు ఉండే పల్లెలో కాకుండా ఏ టౌన్ లోనో, ఒంటరిగా అయ్యుంటే!?’ అని ప్రశ్నించారు.
కాగా, పవన్ కల్యాణ్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కత్తి మహేశ్ ప్రకటించడం తెలిసిందే. పవన్ ఫ్యాన్స్ తనపై ఇలాగే దాడి చేస్తుంటే పవన్‌కు వ్యతిరేకంగా పోరాడడానికి తాను వెనుకంజ వేయబోనని స్పష్టం చేశాడు.