nani: శర్వానంద్ వద్దన్న కథకు నాని ఓకే చెప్పాడా?

  • నాని తాజా చిత్రంగా 'కృష్ణార్జున యుద్ధం'
  • ద్విపాత్రాభినయంలో నాని 
  • వైవిధ్యంతో క్లాస్ లుక్ - మాస్ లుక్        

ఆ మధ్య శర్వానంద్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. క్లాస్ లుక్ తోను .. మాస్ లుక్ తోను ఆయన అదరగొట్టేయనున్నట్టు చెప్పుకున్నారు. అయితే ఈ కథ విషయంలో తర్జనభర్జనలు పడిన శర్వానంద్, చివరికి దానిని వదులుకున్నాడు. ఆ కథే ఇప్పుడు నాని హీరోగా తెరకెక్కుతోన్న 'కృష్ణార్జున యుద్ధం' అనే ప్రచారం జరుగుతోంది.

శర్వానంద్ కుదరదని చెప్పిన కథ .. ఆ తరువాత నాని దగ్గరికి వెళ్లిందట. నాని తన బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా మార్పులు చేయించేసి రంగంలోకి దిగిపోయాడని అంటున్నారు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వదిలిన నాని మాస్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. క్లాస్ లుక్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. 'హలో బ్రదర్' తరహాలో సాగే ఈ సినిమా, నాని ఖాతాలో మరో హిట్ ను జమ చేస్తుందేమో చూడాలి.    

More Telugu News