మోదీని రావ‌ణుడిగా చూపిస్తున్న‌ పోస్ట‌ర్లు వేసిన కాంగ్రెస్ నేత‌... పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీని రావ‌ణుడిగా చూపిస్తున్న‌ పోస్ట‌ర్లు వేసిన కాంగ్రెస్ నేత‌... పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత‌

  • కాంగ్రెస్ నేత రామ శంక‌ర్ శుక్లాపై ఎఫ్ఐఆర్ న‌మోదు
  • ఫిర్యాదు చేసిన బీజేపీ నేత సూర్య ప్ర‌కాశ్ తివారీ
  • రాహుల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా యూపీలో ప్ర‌త్య‌క్ష‌మైన పోస్ట‌ర్లు
కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఉత్త‌ర ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆయ‌న‌ను రాముడిగా, ప్ర‌ధాని మోదీని ప‌ది త‌ల‌ల రావ‌ణునిగా చూపిస్తూ తయారుచేసిన పోస్ట‌ర్లను ప్రచారం చేయడంపై బీజేపీ నేత‌లు మండిప‌డ్డారు. దీన్ని ఖండిస్తూ బీజేపీ నేత సూర్య ప్ర‌కాశ్ తివారీ, కాంగ్రెస్ నేత రామ శంక‌ర్ శుక్లాపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే పోస్ట‌ర్లు పెట్ట‌డంపై కాంగ్రెస్‌కి ఎలాంటి సంబంధం లేద‌ని అమేథీ జిల్లా కాంగ్రెస్ క‌మిటీ వాదిస్తోంది.

కాగా, కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధం లేని అభ‌య్ శుక్లా అనే వ్య‌క్తి వీటిని త‌యారుచేయించిన‌ట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీని రాముని అవ‌తారంగా పేర్కొంటూ, ప్ర‌ధాని మోదీని రావ‌ణుడిగా అభివ‌ర్ణిస్తున్న ఈ పోస్ట‌ర్లు అమేథీలోని ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో క‌నిపించాయి. వీటికి సంబంధించిన ఫొటోల‌పై బీజేపీ మ‌ద్దతుదార్లు సోష‌ల్ మీడియాలో విరుచుకుప‌డుతున్నారు.
Narendra Modi
rahul gandhi
Uttar Pradesh

More Telugu News