దర్శకుడు పి. వాసు చనిపోయాడంటూ వార్తలు... ఖండించిన దర్శకుడు
- వీడియో మెసేజ్ ద్వారా స్పష్టత
- వాట్సాప్‌లో చక్కర్లు కొట్టిన మరణవార్త
- ఆందోళన పడిన అభిమానులు
తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, వాట్సాప్ మెసేజ్ చూడగానే తనకు నవ్వొచ్చిందని, అభిమానులు ఆందోళన చెందవద్దని ఆయన వీడియోలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఏడాది మూడు సినిమాలకు దర్శకత్వం వహించబోతున్నట్లు వాసు వీడియోలో తెలిపారు. గతంలో కూడా చాలా మంది దర్శకులు, నటులు మరణించినట్లు తప్పుడు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.