కృష్ణా, అనంతపురం జిల్లాలలో జోరుగా పందుల పోటీలు.. తెలంగాణ నుంచి కూడా పందుల యజమాన్లు హాజరు

  • ఏపీలో జోరుగా సంక్రాంతి వేడుకలు
  • కోడి, పొట్టేళ్లు, పందుల పోటీలతో ఫుల్ జోష్
  • తెలంగాణ నుంచి కూడా హాజరు
సంక్రాంతి సందర్భంగా ఏపీలో కోడి పందేలు, పేకాట, గుండాటలతో జనాలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇదే సమయంలో పొట్టేళ్ల పందేలు కూడా జోరుగా సాగుతున్నాయి. వీటి మధ్యలో పందుల పోటీలు కూడా జనాలను ఉర్రూతలూగిస్తున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులోను, అనంతపురం జిల్లా తాడిపత్రిలోను పందుల పందేలు ఆసక్తికరంగా సాగాయి. తాడిపత్రిలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలను వినూత్నంగా నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు ఏపీ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా అత్యధిక సంఖ్యలో పందులను తీసుకుని యజమానులు హాజరయ్యారు.  
Go Back to Shorts
sankranthi
pandula pandelu

More Telugu News