భోగి మంటలతో ఉత్సాహంగా మొదలైన సంక్రాంతి సంబరాలు... పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, సినీ నటులు!

  • రైతుల చేతికి పంట
  • ప్రతి ఇంటి ముందూ రంగవల్లులు
  • ఉత్సాహంగా పాల్గొన్న నేతలు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ మొదలైంది. రైతులకు కొత్త పంటలు చేతికి వచ్చిన వేళ, చెరుకు గడలు, పూలతో అలంకరించిన ఎడ్ల బండ్లు, ఇంటి ముందు రంగవల్లులు, గొబ్బెమ్మలు పలకరిస్తున్న వేళ, భోగి మంటలతో ప్రజలు సంక్రాంతిని స్వాగతించారు. ప్రతి ఊరిలో, పట్టణంలో వీధివీధుల్లో భోగి మంటలు కనిపిస్తున్నాయి.

 పలువురు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరి ప్రాంతాల్లో నిర్వహించిన సంబరాల్లో వారు పాల్గొని ప్రజలతో ఆనందాన్ని పంచుకున్నారు. సినీ సెలబ్రిటీలు సైతం వీధుల్లోకి వచ్చి భోగి మంటలు వేసి ఉత్సాహంగా గడిపారు. భోగి వేడుకలు అంబరాన్ని అంటుతున్న వేళ, మంటల చుట్టూ కోలాటాలు ఆడుతూ పండక్కి స్వాగతం పలికారు. పలువురు ఏపీ మంత్రులు భోగి మంటల ముందు చిన్నారులను కూర్చోబెట్టి భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు.
Go Back to Shorts
Bhogi
Sankranthi
Farmers

More Telugu News