Kathi Mahesh: మూడు రోజులు ఆగండి. విషయం తెలుస్తుంది!: కత్తి మహేష్

షార్ట్స్‌లో చూడండి
ఇటీవలి కాలంలో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ పై, ఆయన అభిమానులపై విమర్శలతో విరుచుకుపడి, నాలుగైదు రోజులుగా సైలెంట్‌ గా ఉన్న సినీ విశ్లేషకుడు క‌త్తి మ‌హేష్ తాజాగా మ‌రో ట్వీట్ చేశాడు. జనవరి 15 వరకూ సైలెంట్ గా ఉంటే ఆ తరువాత సమస్య పరిష్కారం అవుతుందన్న నిర్మాత కోన వెంకట్ సలహాను పాటిస్తున్నానని చెప్పిన ఆయన, గత రాత్రి ఓ ట్వీట్ వదిలాడు.

"ఖాళీ పాత్ర‌లే ఎక్కువ శ‌బ్దం చేస్తాయి. నిజాల కోసం జ‌న‌వ‌రి 16 వ‌ర‌కు ఆగండి" అని కత్తి ఓ ట్వీట్ చేశాడు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా విడుదలైన 'అజ్ఞాత‌వాసి' ఓ చెత్త సినిమా అని కత్తి రివ్యూ ఇచ్చిన తరువాత, పవన్ అభిమానులు ఆయనపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో సినిమా థియేటర్లే ఏ చిత్రం భవిష్యత్తు ఏంటన్న విషయం చెబుతాయన్న అర్థం వచ్చేలా కత్తి ట్వీట్ వచ్చిందని కామెంట్లు వస్తున్నాయి.
Go Back to Shorts
Kathi Mahesh
Pawan Kalyan
Agnatavaasi
Twitter

More Telugu News