agnaathavaasi: ‘బహిరంగవాసి’ పేరుతో వర్మ మార్ఫింగ్ పోస్టర్ .. వైరల్ !

షార్ట్స్‌లో చూడండి
సోషల్ మీడియాలో పలు వివాదాస్పద ట్వీట్లతో నిత్యం వార్తల్లో నిలిచే రామ్‌గోపాల్ వర్మ తాజాగా 'అజ్ఞాతవాసి' సినిమా పోస్టర్ ని మార్ఫింగ్ చేసి పేరడీ చేశారు. ఆమధ్య విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమా పోస్టర్ ని మార్ఫింగ్ చేస్తూ.. 'రామ్ గోపాల్ రెడ్డి' అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో వర్మ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వర్మ.. ‘అజ్ఞాతవాసి’ సినిమాలోని ఓ పోస్టర్‌లో పవన్‌ ఫొటో స్థానంలో తన ఫొటోని మార్ఫ్‌ చేసి, ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. దీనికి ‘బహిరంగవాసి’ అంటూ టైటిల్‌ పెట్డడంతో అది వైరల్‌గా మారింది.
Go Back to Shorts
agnaathavaasi
rgv
Pawan Kalyan

More Telugu News