12 బ్యాంకుల మొబైల్ యాప్స్ కు భద్రతా ముప్పు... కస్టమర్లకు హెచ్చరిక సందేశాలు!
- సురక్షిత విధానంలో మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ వినియోగించాలి
- ఖాతాదారులకు బ్యాంకుల సూచన
- జాబితాలో యాక్సిస్, హెచ్ డీఎఫ్ సీ, ఎస్ బీఐ, ఐసీఐసీఐ సహా పలు ఇతర యాప్స్
ఆండ్రాయిడ్ బ్యాంకర్ ఏ9480 పేరుతో పిలిచే ఈ మాల్వేర్ ను కస్టమర్ల లాగిన్ వివరాలు కొట్టేయడానికి, వారి మొబైల్ కు వచ్చే ఎస్ఎంఎస్ లను హైజాక్ చేసేందుకు, నకిలీ నోటిఫికేషన్లు పంపేందుకు వీలుగా డిజైన్ చేసినట్టు క్విక్ హీల్ గుర్తించింది. నకిలీ ఫ్లాష్ ప్లేయర్ యాప్ ద్వారా ఈ మాల్వేర్ చొరబడుతున్నట్టు తేలింది. క్విక్ హీల్ తన జాబితాలో పేర్కొన్న భారత బ్యాంకుల యాప్స్ ను చూస్తే... యాక్సిస్ మొబైల్, హెచ్ డీఎఫ్ సీ మొబైల్ బ్యాంకింగ్, ఎస్ బీఐ ఫ్రీడమ్ ప్లస్(ఎస్ బీఐ ఎనీవేర్), హెచ్ డీఎఫ్ సీ క్విక్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఐ మొబైల్, ఐడీబీఐ బ్యాంక్ గో మొబైల్ ప్లస్, ఐడీబీఐ బ్యాంకు అభయ్, ఐడీబీఐ బ్యాంక్ గో మొబైల్, ఐడీబీఐ ఎంపాస్ బుక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎం పాస్ బుక్, యూనియన్ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్, యూనియన్ బ్యాంకు కమర్షియల్ క్లయింట్స్ యాప్ ఉన్నాయి.