Uttar Pradesh: బంధువు ఇంట్లో భోజ‌నం చేసిన తొమ్మిది మంది అనుమానాస్ప‌ద‌ మృతి!

షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్ర‌దేశ్ రాజ‌ధాని లక్నోలోని థాల్‌ ఖుర్ద్‌ గ్రామంలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. బంధువు ఇంటికి భోజనానికి వెళ్లిన తొమ్మిది మంది వ్య‌క్తులు క‌డుపు నిండా తిని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌పై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆ తొమ్మిది మందిలో ఎనిమిది మంది అస్వస్థతకు గురై, ఒకరు గుండెపోటుకు గురై  ప్రాణాలు కోల్పోయారు.

వారిని భోజనానికి పిలిచిన వ్యక్తి ఈ విష‌యాన్ని పోలీసులకు కూడా తెల‌ప‌లేదు. ఆయ‌న‌ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండ‌గా ఈ విష‌యం గురించి పోలీసులకు అజ్ఞాత‌వ్య‌క్తి నుంచి స‌మాచారం అందింది. ఆ వ్యక్తే విషం పెట్టి హ‌త్య చేశాడా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తొమ్మిది మంది మృత‌దేహాల‌ను శ‌వ‌ప‌రీక్ష‌ల నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.
Go Back to Shorts
Uttar Pradesh
Family of 9 Dead
Relative’s Home

More Telugu News