Pawan Kalyan: ‘హైపర్’ ఆదికి అజ్ఞాతవాసి బాగా నచ్చేసిందట!

షార్ట్స్‌లో చూడండి
ఈరోజు విడుదలైన ‘అజ్ఞాతవాసి’ సినిమాను చూశానని, తనకు నచ్చిందని ‘జబర్దస్త్ ’ నటుడు ‘హైపర్’ ఆది అన్నాడు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ కోసం పదిసార్లు, త్రివిక్రమ్ కోసం మూడుసార్లు ఈ సినిమా చూడొచ్చని, మిగిలిన నటీనటుల కోసమైతే వీలున్నప్పుడల్లా ఈ సినిమాకు వెళ్లొచ్చని, ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ‘బ్లాక్ బస్టర్’ అని చెప్పొచ్చని అన్నాడు. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ చెప్పే డైలాగ్, ‘రాజ్యం మీద ఆశ లేనోడికంటే గొప్పరాజు ఎవడుంటాడు?’ తనకు బాగా నచ్చిందని, పవన్ కల్యాణ్ కు కరెక్టుగా సరిపోయే డైలాగ్ ఇదని అన్నాడు.
Go Back to Shorts
Pawan Kalyan
agnatavasi

More Telugu News