'పద్మావత్' చిత్రానికి 300ల కత్తిరింపుల వార్తల్లో వాస్తవం లేదు... సీబీఎఫ్‌సీ చైర్మన్!
- ఇలాంటి వార్తలు ప్రచారం చేసి సీబీఎఫ్‌సీ పరువు తీయొద్దు
- సలహా కమిటీ మేరకు ఐదు చిన్న సవరణలు మాత్రమే చేశాం
- ప్రకటన విడుదల చేసిన ప్రసూన్ జోషీ
మీడియాలో వస్తున్న 300ల కత్తిరింపుల కథనాలు అవాస్తవమని ప్రసూన్ జోషీ స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేసి సీబీఎఫ్‌సీ పరువు తీయొద్దని ఆయన కోరారు. జనవరి 25న ఈ చిత్రం విడుదలకానుంది. మరోవైపు సినిమా విడుదలను ఎలాగైనా అడ్డుకుంటామని, పెట్రోలు పట్టుకుని మరీ నిరసనలు, ఆందోళనలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కర్నిసేన ప్రకటించిన సంగతి తెలిసిందే.