Aadhar: 'ఆధార్' భారీ లోపం... ఏ బ్యాంకులో ఖాతా ఉందో 'ఓటీపీ' లేకుండానే తెలిసిపోతోంది... ట్రై చేస్తారా?

  • లోపాన్ని పసిగట్టిన టెక్కీలు
  • ఆధార్ నంబర్ తెలిస్తే చాలట
  • 50 పైసలతోనే బ్యాంకు వివరాలు

మీకు ఎవరిదైనా ఆధార్ ఖాతా సంఖ్య తెలుసా? అయితే వారికి ఏ బ్యాంకులో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. 'యూఐడీఏఐ'లో ఉన్న ఈ లోపాన్ని టెక్కీలు పసిగట్టారు. వాస్తవానికి ప్రజలు తమ ఏఏ బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానాన్ని పూర్తి చేసుకున్నారోనన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఆధార్ బ్యాంక్ మేపర్ వెబ్ సైట్ ద్వారా అవకాశాన్ని కల్పించింది. ఈ సేవలను వాడుకోవాలంటే, రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీ (వన్ టైమ్ పాస్ వర్డ్)ను ఎంటర్ చేయడం తప్పనిసరి. అయితే, ఓటీపీ లేకుండా కూడా దీన్ని తెలుసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

మీ ఫోన్ నుంచి *99*99*1# అని టైప్ చేయాలి. దీనికి 50 పైసల చార్జ్ పడుతుంది.
ఆపై మీ ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయాలన్న డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
అక్కడ ఆధార్ సంఖ్యను ఎంటర్ చేసి, ఆపై కన్ఫర్మ్ చేయాలి. వెంటనే ఏఏ బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానమై ఉందో డిస్ ప్లే అవుతుంది. ఈ విధానంలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అవసరం లేదు సరికదా, 'ఓటీపీ'తోనూ అవసరం రాదు. మీరూ ట్రై చేసి చూడండి!

More Telugu News