'అజ్ఞాతవాసి' సినిమా చూస్తున్న కత్తి మహేష్... బయటకొచ్చి ఏం చెబుతాడో!

  • ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రత్యేక షో
  • సినిమా చూసేందుకు వచ్చిన కత్తి మహేష్
  • గతంలో 'లార్జో వించ్'ని కాపీ కొట్టారని ఆరోపించిన కత్తి
ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తనను టార్గెట్ చేసుకున్నారని, తన అభిమానులను నియంత్రించడంలో పవన్ విఫలమయ్యాడని ఆరోపిస్తూ, వార్తల్లో నిలిచిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్, ఈ ఉదయం 'అజ్ఞాతవాసి' చిత్రం చూసేందుకు వెళ్లాడు. బంజారాహిల్స్ ప్రసాద్స్ ల్యాబ్స్ లో ఉదయం 8 గంటలకు వేసిన షోకు ఆయన హాజరయ్యాడు. సినిమా చూసి వచ్చిన తరువాత మాట్లాడతానని ఆయన చెప్పాడు. కాగా, ఈ చిత్రం ఫ్రెంచ్ సినిమా 'లార్గో వించ్'కి కాపీయని గతంలో కత్తి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన సినిమా చూసి వచ్చి ఎలా స్పందిస్తాడన్న ఆసక్తి నెలకొంది.
Go Back to Shorts
prasad labs
Kathi Mahesh
Pawan Kalyan
Agnatavaasi

More Telugu News