'అజ్ఞాతవాసి'పై తొలి రివ్యూలు.. పాజిటివ్ టాక్!
Add ap7am to your home Screen

'అజ్ఞాతవాసి'పై తొలి రివ్యూలు.. పాజిటివ్ టాక్!

  • థియేటర్లను తాకిన 'అజ్ఞాతవాసి'
  • పాజిటివ్ గా తొలి రివ్యూలు
  • పవర్ స్టార్ అభినయంపై ప్రశంసల వర్షం
గత అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ తో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాలలోను, ఈ ఉదయం తెలంగాణలోను విడుదలైన పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి'పై తొలి రివ్యూలు వచ్చేశాయి. ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు తన రివ్యూను ఇస్తూ, ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అని తేల్చాడు. ఐదు స్టార్లకుగాను నాలుగు స్టార్లు ఇచ్చిన ఆయన, పవర్ స్టార్ అభినయంపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టెయినర్ అని వ్యాఖ్యానించాడు.

స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అద్భుతమని, సినిమాటోగ్రఫీ చాలా బాగుందని చెప్పాడు. ఆడియన్స్ చేత విజిల్స్ వేయించే సీన్లు ఉన్నాయని, క్లాస్, మాస్ ప్రేక్షకులకు నచ్చుతుందని, ఐదు రోజుల వీకెండ్ ను చూసుకుని సరైన సమయంలో విడుదలైందని చెప్పాడు. మరో సినీ విశ్లేషకుడు రివ్యూ ఇస్తూ, రెస్టారెంట్ లోని ఫైట్ సీన్ కొంచెం నిడివి ఎక్కువైందని, ఈ సినిమా తరువాత అనిరుధ్ వంటి ఓ గొప్ప సంగీత దర్శకుడు పరిశ్రమకు దొరికాడని వెల్లడించాడు. కీర్తీ సురేష్ పాత్ర నిడివి కొంచమేనని చెప్పాడు. తొలి సగం సెంటిమెంట్ తో ఉండగా, రెండో భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించారని మరో క్రిటిక్ వ్యాఖ్యానించాడు.
Power Star
Pawan Kalyan
Agnatavaasi
Movie
Review

More Telugu News