Pawan Kalyan: 'కోటేశ్వరరావు'ల మనోభావాలు దెబ్బతిన్నాయి... పవన్ 'అజ్ఞాతవాసి' పాటపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న అజ్ఞాతవాసి సినిమా రేపు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇందులో 'కొడకా కోటేశ్వరరావు ఖరుసైపోతవురో..' అంటూ పవన్ కల్యాణ్ పాడిన పాటకు మంచి స్పందన వస్తోంది. అయితే, విజయవాడకు చెందిన కోటేశ్వరరావు అనే న్యాయవాది ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనిపై మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ పాట వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోటేశ్వరరావులు అందరూ బాధపడతారని అన్నారు. కోటేశ్వరరావు పేరుగల వారి మనోభావాలు దెబ్బతినేలా పాట వుందని ఆరోపిస్తున్నారు. కోటేశ్వరరావు పాటను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.