గుండు హనుమంతరావుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం విడుదల చేసిన తెలంగాణ స‌ర్కారు
Add ap7am to your home Screen

గుండు హనుమంతరావుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం విడుదల చేసిన తెలంగాణ స‌ర్కారు

  • కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతోన్న గుండు హ‌నుమంత‌రావు
  • వారానికి మూడు సార్లు డయాలసిస్
  • గుండు హనుమంత‌రావు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా:  కేటీఆర్‌
సినిమాల్లో హాస్య‌పాత్ర‌లు వేసి అల‌రించిన గుండు హ‌నుమంత‌రావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సి ఉందని వైద్యులు సూచించగా, చికిత్సకు అవసరమైన ఆర్థిక స్తోమత లేకపోవడంతో గుండు హ‌నుమంత‌రావు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇటీవ‌లే ఆయ‌నకు మెగాస్టార్ చిరంజీవి రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్థిక సాయం అందించారు. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం ఐదు లక్షల రూపాయల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆయనకు విడుదల చేసింది. ఈ సందర్భంగా గుండు హనుమంత‌రావు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాన‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు.
KTR
gundu hanumantha rao
Telangana

More Telugu News